Reporter -Silver Rajesh Medak.
Date-21/04/2024.
హనుమాన్ జయంతి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి.
జిల్లా ఎస్ పి. డా. బి.బాలస్వామి. ఐ పి ఎస్
శోభ యాత్ర నిర్వహించే సమయంలో ప్రజలంతా పోలీస్ వారికి పూర్తి సహకారం అందించాలి.
కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షణ
శోభ యాత్ర సమయంలో సామాజిక మాధ్యమాలలో ఇతరుల మనోభావాలను కించపరచడం చేయరాదు
అభ్యంతరకరమైన పోస్టులు, తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో
ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు
జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.యెస్.
ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి. డా.బి.బాలస్వామి ఐ.పి.యెస్ మాట్లాడుతూ….. హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని సంబంధిత, రెవెన్యూ, మున్సిపల్, ఎలెక్ట్రిసిటీ లాంటి అన్నీ శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఎస్పీ గారు తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అవసరం ఉన్న ప్రదేశాలలో ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, ట్రాఫిక్ జాం కాకుండా ప్రతి చౌరస్తా పికెట్స్, ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, ర్యాలీ నిర్వహించే సమయంలో ప్రజలు పోలీసు వారికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. హనుమాన్ శోభయాత్ర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజా క్షేమం కోసం ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తనకు అప్పగించిన విధులను అంకితభావంతో నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. హనుమాన్ శోభయాత్రను జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ ద్వారా 24/7 పర్యవేక్షిస్తూ సంబంధిత పోలీసు అధికారులకు తగిన సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శోభయాత్ర సమయంలో సామాజిక మాధ్యమాలలో ఇతరుల మనోభావాలను కించపరచడం చేయరాదు. ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టకూడదని సోషల్ మీడియా పై ఐటీ కోర్ టీమ్ తో నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని అలాంటి తప్పుడు ప్రచారాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.యెస్ అధికారులను ఆదేశించారు. హనుమాన్ జయంతి శోభయాత్ర శాంతియుతంగా ఊరేగింపులు జరుపుకోవాలని, పోలీసులతో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. మెదక్ జిల్లా పరిదిలోని సున్నితమైన ప్రదేశాలలో ఉత్సవాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, ప్రజలు సంతోషంగా, శాంతియుతంగా వేడుకలు జరుపుకోవాలని, ఇతర మతస్తులను గౌరవిస్తూ తమ కార్యక్రమాలను నిర్వహించుకోవాలని మత సామరస్యం కలిగి ఉండాలని పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్.పి డా.శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.యెస్ కోరారు.