Reporter -Silver Rajesh Medak.
తేదీ 19-4-2024.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ రికార్డులను పటిష్టంగా నిర్వహించాలి:
ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వాన్షీ IRS
ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల రికార్డులను పటిష్టంగా నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వాన్షీ IRS అధికారులను ఆదేశించారు. శుక్రవారం వ్యయ పరిశీలకులు సునీల్ కుమార్ రాజ్ వాన్షీ IRS కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మెదక్ పార్లమెంట్ నియోజక వర్గ నోడల్ అధికారులు,SST,FST,VVT, టీమ్ సభ్యులు, ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకుడు మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గంలో ని 7 అసంబ్లీ సెగ్మెంట్లలో సహాయ వ్యయ పరిశీలన అధికారులతో సమన్వయం చేసుకొని ఆర్ ఓ స్థాయిలో ప్రతిరోజు వ్యయ నివేదికలను క్రోడీకరించు కోవాలని అన్నారు. అకౌంటింగ్ టీంలు అకౌంట్ వివరాలను నమోదు చేయాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఆమోద, ఆమోద యోగ్యం కాని ప్రతి ఖర్చుల వివరాలను సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ టీమ్, వి.ఎస్.టి., వి.వి.టి లు సెగ్మెంట్ల వారిగా నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ద్వారా నిర్వహించు ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, రోడ్ షోలు అన్నింటిని వీడియో సర్వేయలెన్స్ టీం సభ్యులు రికార్డింగ్ చేసి వీడియో పరిశీలన సభ్యుల ద్వారా సదరు వీడియో పరిశీలించి వివరాలను అకౌంటింగ్ టీం సభ్యులతో సమన్వయం చేసుకోని షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్ లో తప్పకుండా నమోదు చేసి పూర్తి వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు.
జిల్లా రిటర్నింగ్ అధికారి/ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ… ర్యాలీ లు, సమావేశాలు ద్వారా నిర్వహించిన పార్టీ, ప్రచార ఖర్చులు నిర్ణయించిన ధరల ప్రకారం నమోదు చేయాలని అన్నారు. పోటీ చేయు అభ్యర్థులు తమ ప్రచార వ్యయ ఖర్చుల వ్యయ అకౌంట్ లు, రిజిష్టర్ లు సక్రమంగా నిర్వహించాలని అన్నారు.
వ్యయ పరిశీలకులు అభ్యర్థుల ఖర్చులను నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికల సందర్భంగా, ఎన్నికల అనంతరం పరిశీలన చేయనున్నారని, పరిశీలనకు మధ్య మూడు రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు.
స్టాటిక్ సర్వేలేన్స్ టీం నిర్వహణను పరిశీలించి నిఘా బృందాలు సమర్థంగా నిబద్ధతతో విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను పక్కగా పాటించాలన్నారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, డబ్బు, మద్యం ఇతర వస్తువుల పంపిణీ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్,అదనపు ఎస్పీ మహేందర్, ARO లు, నోడల్ అధికారులు,ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.