తేది 19.4.2024.
జిల్లాలో 1785 మంది రైతుల దగ్గర 8,450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
శుక్రవారం నిజాంపేట మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అకాల వర్షాలతో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం రక్షణ చర్యల్లో భాగంగా అదనపు టార్పాలిన్ మంజూరు చేసి రక్షణ కల్పించాలన్నారు . కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు భరోసా కల్పిస్తూ ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసే విధంగా పగడ్బందీగా చర్యలు చేపట్టామని వివరించారు. ఇప్పటివరకు జిల్లాలో 1785 మంది రైతులు దగ్గర 8450 టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా 8,105 టన్నుల ధాన్యాన్ని మిల్లులకు ఎగుమతి చేసి 108 రైతులకు ఒక కోటి 27 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరిగిందని వివరించారు.
ప్రతి మండలానికి జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని, బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగకుండా ఉప తహసీల్దార్ లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు. కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి, రవాణాలో ఇబ్బందులు కలుగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి కనీసం మద్దతు ధరపై విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు.