Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలం సుతారిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పర్యటించారు.ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడుతూ మెదక్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.వెంకట్రామి రెడ్డి ఆయన జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉండి ప్రజలకు సేవ చేసే మంచి పేరున్న వ్యక్తి అన్నారు.అదేవిధంగా పివిఆర్ ట్రస్ట్ ద్వారా మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఆయన పేద విద్యార్థుల చదువులకు ఆయన ఆర్థిక సహాయం అందించి చదువుకునే విధంగా ఆయన కృషి చేస్తారని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసే మంచి నాయకుడు వెంకట్రామి రెడ్డిని గుర్తించి కారు గుర్తుకే ఓటు వేసి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ బాదె చంద్రం,సుతారిపల్లి గ్రామ సర్పంచ్ ఉమామహేష్, దేశెట్టి.లింగం, కౌన్సిలర్ సరాఫ్.శ్యామ్,మహమ్మద్ సల్మాన్,చింతల రాములు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.