Reporter -Silver Rajesh Medak.
తేదీ 16-4-2024
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
-నామినేషన్లకు సర్వం సిద్ధం
—— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లాలో ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించనున్నామని, ఇందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు.
నామినేషన్ ల స్వీకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో కలెక్టరేట్ లోని విడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచందర్ రాజు లతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఈ నెల 18 న నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని, ఈ నెల 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26 న నామినేషన్ల స్ర్కూటినీ చేస్తారు. 29 వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారన్నారు. అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
15 రోజులపాటు అభ్యర్థుల ప్రచారాల తర్వాత మే 13 న పోలింగ్ నిర్వహిస్తారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపును చేపట్టి లెక్కింపు పూర్తికాగానే గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారనీ జిల్లా కలెక్టర్ తెలిపారు.
జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు.
రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో నామినేషన్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను, నామినేషన్ పత్రాలు అందించే కౌంటర్లను, సెక్యూరిటీ డిపాజిట్ కౌంటర్లను, కంట్రోల్ రూంలను, హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసిందన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.
సువిధ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్లికేషన్ సక్సెస్ అయిన తర్వాత వచ్చే పత్రాలపై అభ్యర్థి స్వయంగా సంతకం చేసి కాపీలను రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ఒకరోజు ముందే అభ్యర్థి తన పేరున ఎన్నికల ఖర్చు కోసం కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించి ఖాతాకు సంబంధించిన వివరాలను ఆర్‌వో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ వేసే గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక ప్రతిపాదకుడిని, ఇండిపెండెంట్లు, రిజిస్టర్ పార్టీలకు చెందిన అభ్యర్థులు పదిమంది ప్రతిపాదకుల సంతకాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రతిపాదకులందరు సంబంధిత నియోజకవర్గానికి చెందిన ఓటర్లయి ఉండాలన్నారు. ప్రతిపాదకులు నిరక్షరాస్యులైన పక్షంలో ఆర్‌వో సమక్షంలోనే వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. రిజర్వుడ్ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్‌తోపాటు కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ధ్రువపత్రాలు అందుబాటులో లేకుంటే స్ర్కూటీని సమయానికి ఆర్వో కార్యాలయంలో వాటిని అందజేయాలనారు.
జనరల్ అభ్యర్థులు 25 వేల రూపాయలు, ఎస్సీ అభ్యర్థులు 12,500 రూపాయలు చెక్, చలానా రూపంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించాలన్నారు.
నామినేషన్లు వేసే అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ సూచనలు
- ఈ నెల 18 వ తేదీ నుంచి వ 25 తేదీ వరకు నామినేషన్ స్వీకరణ
-ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ
-నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి
– నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి
- నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ చేసి EC కి వెల్లడించాలి.
-కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి
-సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం – ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి.
-ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO
-ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO -నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు.
- నామినేషన్ కేంద్రాలలోకి 3 వాహనాలు.. అభ్యర్థితో సహా ఐదుగురికే అనుమతి
-రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మ అనుమతిస్తారు.
పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా
ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లాలో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్ లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వెలియన్స్ లో ఖర్చుల పర్యవేక్షణ బృందాలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ చెప్పారు.
ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం,నగదు ప్రలోబపరిచే వస్తువులు సరఫరా కాకుండా జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పటిష్ట నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, అట్టి చెక్ పోస్ట్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎలక్షన్ సూపరిండెంట్ హర్దీప్ సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.