Reporter -Silver Rajesh Medak.
తేదీ 16-4-2024.
ఎన్నికల సజావుగా నిర్వహణకు రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లతో తో కలిసి కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణ, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, ఖర్చుల రిజిస్టర్ ల నిర్వహణ, తదితరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… 18 వ తేదిన నోటిఫికేషన్ ప్రకటించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని,25 వ తేదీన నామినేషన్ల స్వీకరణ ముగుస్తుందని తెలిపారు. అభ్యర్థులు తమ నామినేషన్లను ఏప్రిల్ -25 తేదీ సాయంత్రం 3:00 గంటల లోగా వేయాలన్నారు. కార్యాలయ పని దినాల్లో ఏప్రిల్ -18 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకూ ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 03.00 గంటల వరకూ నామినేషన్ లు స్వీకరిస్తానని చెప్పారు.
26 వ తేదీన నామినేషన్ ల స్క్రూటినీ ఉంటుందన్నారు.
29 వ తేదీన నామినేషన్ ల ఉపసంహరణ కు తుది గడువు అని చెప్పారు.
మెదక్ పార్లమెంట్ సంబంధించి అన్ని కలిపి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల సౌకర్యార్థం నామినేషన్ కేంద్రాలలో హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశామన్నారు.నామినేషన్ దాఖలుకు ముందు అభ్యర్థులు తమ నామినేషన్లను హెల్ప్ డెస్క్ లో చెక్ చేయించుకోవాలన్నారు.
ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు నామినేషన్ చెట్లను దాఖలు చూసేందుకు అవకాశం ఉందన్నారు.
నామినేషన్ ల దాఖలుకు అభ్యర్థితో పాటు 5 గురికి ( 1 +4) కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు .
ఫారం -6 ద్వారా సమర్పించే అఫిడవిట్ లో అన్ని ఖాళీలు పూరించాలని చెప్పారు . నామినేషన్ సమయంలో క్రిమినల్ కేసులు, కన్విక్షన్ కేసుల వివరాలు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా లో 3 సార్లు పబ్లిష్ చేయాలన్నారు.
అభ్యర్థులు కొత్త ఖాతా తెరిచి దాని నుంచే చెల్లింపులు జరపాలన్నారు.
నామినేషన్ కేంద్రం నుంచి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల దూరం నుండి కేవలం 3 వాహనాలనే అనుమతిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకారం అందించాలన్నారు.ఈ కార్యక్రమం లో రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.