వడియారంలో బిఅర్ఎస్ పార్లమెంటరీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం

మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో చేగుంట,నార్సింగి మండలాల పార్లమెంటరీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి హాజరయ్యారు.అనంతరం వారు మాట్లాడుతూ100 కోట్లతో పేద విద్యార్థులకు విద్యను అందించే దిశగా ప్రజలకు సేవ చేస్తానని వెంకటరామిరెడ్డి అన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.తాను గెలిచిన 9 నెలల్లోనే మెదక్ నియోజకవర్గంలో తన సొంత డబ్బులతో బిఆర్ఎస్ కార్యకర్తలకు పేదవారికి సేవ చేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో చేగుంట జడ్పిటిసి శ్రీనివాస్, నార్సింగి ఎంపీపీ సబితా రవీందర్, జెడ్పిటిసి కృష్ణారెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత, రైతుబంధు జిల్లా డైరెక్టర్ మోహన్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు రాజ్ రెడ్డి,సుభాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!