Date-15/04/2024.
కొనుగోలు చేసిన ధాన్యానికి కనీస మద్దతు ధర రైతులకు చెల్లింపులు మొదలు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.
యాసంగి ధాన్యం కనీస మద్దతు ధరకు విక్రయించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఛాంబర్లో కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు చెల్లింపులు నిర్వహణపై సంబంధిత పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేస్తున్నట్లు, మెదక్ జిల్లాలో హవేలీ ఘన్పూర్ మండలంలో కొనుగోలు కేంద్రాల రైతులకు 108 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసిన ధాన్యానికి గాను 14 మంది రైతులకు 24 .05 లక్షల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.
రవాణా సంబంధిత విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులతో సమన్వయం చేసుకుని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
కొనుగొలులో ఉన్న ఇబ్బందులను, మార్కెట్ ధరను దృష్టిలో ఉంచుకుని రైతులు ఒకేసారి మూకుమ్మడిగా ధాన్యాన్ని మార్కెట్ తీసుకురాకుండా దశల వారిగా తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు ఆదేశించారు.
.కనీస మద్దుతు దరకంటే తక్కువకు దళారులు ఎవరైనా కొలుగోలు చేస్తే పోలీస్ కేసులు నమోదు చేసేలా చూడాలన్నారు.
కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం విక్రయాలకు వచ్చునపుడు వ్యవసాయ అధికారులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ పాసు పుస్తకం మొదటి రెండు పేజీలు, ఆధార్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ పత్రాలను వెంట తెచ్చుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసర అధికారులు బ్రహ్మారావు ,హరి కృష్ణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.