చేవెళ్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు షాక్ లమీద షాక్ లు తగులుతున్నాయి. మంగళవారం మండలంలో పలువురు బీఆర్ఎస్ మాజీ సర్పంచులు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు పని చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి పామేన భీం భరత్ ఆధ్వర్యంలో దామరగిద్ద, ఉరేళ్ల, సింగప్పగూడ గ్రామాల మాజీ సర్పంచులు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.