మూగ ప్రాణులు ఐనటువంటి నందీశ్వరులకు రక్షణ ఏదీ ఎండాకాలంలో మేతకు వెళ్ళిన మనుషులు చేసిన నిర్లక్ష్య ధోరణిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్నాయి సదరు యజమాని ఏమీ చేయలేని ఎటు పోలేక నిరాశడుడిగా ఉండిపోతున్నాడు.భూమిని దుక్కిదున్ని రైతన్నలకు ప్రపంచ దేశానికి భూమిని దుక్కిదున్ని మేడలు ఒళ్ళు తోలు శరీరంలోని రక్తాన్ని మనుషులు తయారు చేసిన ములికి కట్టెకి రక్తాన్ని చిందిస్తూ ప్రపంచ దేశ వ్యవసాయ శాఖ రంగంలో మెతుకు బతుకు గింజలను పెట్టె ఆ నందీశ్వరులకు రక్షణ కరువైంది మూడు రోజులుగా ఓ బావిలో ప్రమాదవశాత్తుగా దాహం తీర్చుకొనికి చిన్న మడుగనుకొని బావిలో పడి ప్రాణాలు కోల్పోయిన ఆ మూగ ప్రాణి నంది దుస్థితి చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు.కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గం సాంబయ్య కు సంబంధించిన చెను పొలంలో భూమి లెవెల్ గా ఓ బావి ఉన్నది అటుగా మెతక వచ్చిన ఓ మూగ ప్రాణి నంది తేజిగూడ రైతు కమలాకర్ ఎద్దు నందీశ్వరుడు ప్రమాదవశాత్తుగా చిన్న మడుగనుకొని ఎండాకాలం లో మూగ ప్రాణులకు నీళ్లు దొరకడం కష్టంగా ఉంటుంది ఎండు మేత గడ్డి తిని దాహంతో అల్లాడి పోతుంటాయి. ఎక్కడ నీళ్లు కనిపించిన పరిగేడి దాహం తీర్చుకుని తిరిగి మానవ యజమాని నివాసానికి ప్రయాణ మవుతుంటాయి.కానీ కొన్ని చోట్లా మనుషులు చేసిన నిర్లక్ష్యం ప్రమాద ఘటికల్లో అభం శుభం తెలియని అన్నం పెట్టే మూగ ప్రాణులు నందీశ్వరులు బలి అవుతున్నాయి.అలాంటి ప్రమాద ఘటికలో ఓ నంది చనిపోవడాన్ని అటుగా ఇటుగా వెళ్తున్న ప్రజలు మూడు రోజులుగా బావిలో పడి దుర్వాసనకు చేరువలో ఉన్న శవ నందిని చూసి కన్నీరు వచ్చాయని స్థానిక రైతన్నలు పేర్కొన్నారు. యజమాని నంది కోసం మూడు రోజులు అయిన రాలేదని గాలిస్తున్నాడను కుని చూసిన జనులు యజమానికి తెలియ పరిచినట్లుగా సమాచారం. ఏదేమైనా మనుషులు కూసింత జంతువుల పట్లా వాటి ప్రాణాల పట్లా ఏది చేసిన వాటిని దృష్టిలో పెట్టుకుని పొలాల్లో బావులను గ్రామాల్లో కట్టి నట్లుగా ఎత్తుగా కడితే బాగుంటుందని అలాగే పొలాల్లో బావులకు చుట్టుపక్కల రక్షణ కవచాలను అమార్చాలని సాటి తోటి రైతన్నలు కోరుచున్నారు.