Reporter -Silver Rajesh Medak.
తేది-15.04.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది ఈ కార్యక్రమంలో తూప్రాన్ గ్రామం మరియు మండలానికి చెందిన గోలి శ్రీనివాస్ మా తల్లి గోలి ప్రమీల పేరు పై 1521 Sq విస్తీర్ణంలో ఓపెన్ ప్లాట్ (అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం 1170 చ. గజాలు) మెదక్ జిల్లా శివంపేట గ్రామం మరియు మండలంలో ఉందని అట్టి ప్లాట్ ని శివ్వంపేట గ్రామ Ex సర్పంచ్ పులిమామిడి స్రవంతి W/o పులిమామిడి నవీన్ కుమార్ అనే వ్యక్తి సంతకాలను ఫోర్జరీ చేసి శివ్వంపేట గ్రామ పంచాయతీ కార్యాలయ లెటర్ హెడ్‌లపై 05-04-2019 తేదీన రెండు యాజమాన్య ధృవీకరణ పత్రాలను సృష్టించారని కావున నా భూమిపై నకిలీ పత్రాలు సృష్టించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయగరలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని శివంపేట్ ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే నార్సింగి గ్రామానికి చెందిన తిప్పరబోయిన సిద్ది రాములు నా కూతురు పెళ్లి చేసినందున అప్పులు అయినవని నా స్వంత స్ధలము విక్రయించుకుందామని అకుంటుండగ తిప్పరబోయిన మా పాలివారైన సత్యం అనేవ్యక్తి నాకుటంబాన్ని చంపేస్తానని బెదిరిస్తూ భూతుమాటలు తిడుతున్నాడని కావున నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని నార్సింగ్ ఎస్.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది.