Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ చిందం సబితా అధ్యక్షతన నిర్వహించారు. గ్రామాలలో ఉన్న పలు సమస్యలను ఎంపీటీసీలు అధికారులు తీసుకువచ్చారు మన మాట్లాడుతూ మండలంలో పంట నష్ట వివరాలను పూర్తిగా సేకరించి ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రభుత్వ వైద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ ఎండలో తీవ్రంగా ఉన్నాయని ప్రజలు ఎవరు కూడా ఎండ సమయంలో బయటకు వెళ్లకూడదని వెళ్లిన తగు జాగ్రత్తలు తీసుకొని వెళ్లాలని వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ సేవించాలని ఆయన తెలిపారు, ఎంపీడీవో చిన్నారెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో నీటి సమస్య రాకుండా చూడాలని మిషన్ భగీరథ ద్వారా మీరు రాకపోతే సంబంధిత అధికారుల దృష్టి తీసుకుపోయి ప్రజలకు నేటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆయన పంచాయతి కార్యదర్సులకు సూచించారు, తహసిల్దార్ కరీం మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని ధాన్యాన్ని కొనుగోలు కేంద్ర మర్డర్ తీసుకోవాల్సిన సమయంలో తమ పట్టాదార్ పాస్ పుస్తకం తో పాటు బ్యాంక్ పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకువెళ్లాలని కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు, మండల విద్యాధికారి బుచ్చియా నాయక్ మాట్లాడుతూ మండల విద్యా వనరుల కేంద్ర భవనం నిర్మాణం కోసం 10 గుంటల భూమిని ఏర్పాటు చేయడం జరిగిందని ఊరికి దూరంగా ఉన్నందున నిర్మాణం చేపట్టలేకపోతున్నామని ఆయన తెలిపారు, ఏపీవో రాజేశ్వర్ గౌడు మాట్లాడుతూ నార్సింగ్ మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టిన పనులకు జిల్లాలో ప్రథమ స్థానం రాష్ట్రంలో ఆరవ స్థానం రావడం జరిగిందని అందరి సహకారంతోనే పనులు చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు, మొత్తం 2023 24 సంవత్సరానికి సంబంధించిన మూడు కోట్ల నలభై లక్షల రూపాయల పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఎంపీపీ చిందం సబితా రవీందర్ మాట్లాడుతూ ఎండలు తీవ్రంగా ఉన్నందున ముఖ్యంగా మంచినీటి సమస్య రాకుండా పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులు చొరవ చూపాలని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కరీం ఎంపీపీ చిందం సబితా రవీందర్, ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత శంకర్, ఎంపీడీవో చిన్నారెడ్డి, మండల విద్యాధికారి బుచ్చియా నాయక్, ప్రభుత్వ వైద్యాధికారి రవికుమార్, ఈజీఎస్ ఏపీవో రాజేశ్వర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.