Venkatramulu Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రఘుపతి గుట్ట పైన ఈ రోజు ఉదయం శ్రీ సీత శ్రీరామచంద్రుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గం ఇంచార్జ్ పంజా విజయ్ కుమార్ హాజరయ్యారు. ఆయన ఆలయంలో సీతారామచంద్రుల వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు చేసి హోమం నిర్వహించారు.ఈ ఈ సందర్భంగా భక్తులు ఆలయ వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు.అనంతరం ఆలయ అర్చకులు ఆలయ కమిటీ పెద్దలు ఆలయ మర్యాదలతో పంజా విజయ్ కుమార్ గారికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల బిజెపి నాయకులు, నిజాంపేట మండల బిజెపి నాయకులు ధర్మారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.