Reporter -Silver Rajesh Medak.
Date-14/04/2024.
రైతులు అహర్నిశలు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిలా నిలిచేలా కొనుగోలు కేంద్రం అధికారులు, మండల అగ్రికల్చర్ అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా రాహుల్ రాజ్ అన్నారు.
ఆదివారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ మాచవరం ప్యాక్స్ కొనుగోలు కేంద్రం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 410 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని గ్రేడ్ ఏ రకానికి రూ.2203, గ్రేడ్ బీ రకానికి రూ.2183. మద్దతు ధర నిర్ణయించినట్లు చెప్పారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలని అన్నారు. కొనుగోలు కేంద్రం లో బుక్స్ నిర్వహణ, తేమ శాతం చూడటం , గన్నిస్ బ్యాగులు, ధాన్యం కేంద్రాల్లో ఉండాలిసిన వసతుల పైన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలను ఇచ్చారు. అలాగే ధాన్యం తెచ్చే రైతులు పాటించాలిసిన అంశాల పైన అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు కనీస మద్దతు ధరకే కొనుగోలు చేయాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి, రవాణాలో ఇబ్బందులు కలుగకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
రైతులకు భరోసా కల్పిస్తూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు కొనుగోలు కేంద్రాల సమస్యల సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకొని చర్యలు చేపడుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకువచ్చిన ధాన్యానికి తేమశాతం చూసిన తర్వాత రవాణా సౌకర్యం ద్వారా మిల్లర్లకు పంపినప్పుడు అటువంటి ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిబందనలు పాటిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. తేమ శాతం కరెక్ట్ గా ఉన్న ధాన్యానికి తరగు తీసేయకుండా కొనాలని, రైతులు పండించిన దాన్యం విషయంలో ధాన్యం కొనుగోలు కేంద్రం విషయంలో మిల్లర్ల విషయంలో, రవాణా పరమైన విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం రైతులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తు వారు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోసం అనేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతుందని, మిల్లర్లు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోపరేటివ్ అధికారి కరుణ, సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు.