-జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్,
-వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయరాం
స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 11, మహానంది:
సామాన్యుడిగా మొదలై, సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్, వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యదర్శి గాజులపల్లె జయరాంలు పెర్కోన్నారు. బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రసాద్ మాట్లాడుతూ.. సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే అని,భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేశారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని, జీవితాంతం పోరాడిన మహనీయుడు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, ఆన్సర్, రంగనాయకులు, మాబాష, ఇర్ఫాన్, చాంద్, షరీఫ్, సలీమ్, షర్ఫద్దీన్, కరీం, తదితరులు పాల్గొన్నారు.