Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో రైతులు వరి పొలాలలో కోసిన తర్వాత ధాన్యాన్ని నిర్లక్ష్యంగా కామారెడ్డి రోడ్డులో గల వినాయక ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై ఎండపోయడం వలన రోడ్డుపై వాహనాల్లో వెళ్లేవాళ్లు ప్రమాదాలకు గురవుతున్నారని రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని రైతులు ప్రధాన రహదారులపై రైతులు కోసిన వరి ధాన్యాన్ని రోడ్లపై ఎండబెట్టకుండా పంట పొలాల్లోనే ఎండబెట్టుకోవాలని సూచించారు.రోడ్లపై వరి దాన్యం ఎండపోయడం వలన పలు ప్రమాదాలు జరిగాయన్నారు. రాత్రి వేళ్లలలో వివిధ గ్రామాలకు వాహనాలపై వెళ్లే ప్రజలు నానా ఇబ్బందులకు రోడ్డు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రోడ్లపై రైతులు వరి ధాన్యాన్ని ఎండపోసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.