Reporter-Silver Rajesh Medak.
Date-10/04/2024.
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దీకరణపై తుదిమెరుపు.
- చక్కెర కర్మాగారం పున:ప్రారంభించాలని ప్రభుత్వానికి కమిటీ లేఖ
- 2014-15 సంవత్సరంలో లే ఆఫ్ ప్రకటించిన బిఆర్ఎస్ ప్రభుత్వం
- బోధన్ – మెదక్ – మెట్ పల్లి యూనిట్ లలో 407 కోట్ల నష్టం
- ఓటిఎస్ పద్ధతి ద్వారా 51% రాయితీతో అప్పులను చెల్లిస్తామని కమిటీ స్పష్టీకరణ
- మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
- నిజాం షుగర్స్ పునప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం
- చెరుకు రైతన్న జీవితాల్లో నూతన వెలుగులు
- ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పై ఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు.
…………………………………………………………………
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దీకరణపై తుదిఅడుగులు ప్రారంభం అయ్యాయని, చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వానికి నిజాం షుగర్స్ పునరుద్దీకరణ కమిటీ లేఖ ద్వారా స్పష్టం చేసిందని నిజాం షుగర్స్ పునరుద్దీకరణ కమిటీ మెంబర్, నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ పేర్కోన్నారు. 2002-2003 నుండి 2014-2015 వరకు మొత్తంగా 13 సీజన్స్ నడిపించిందని, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 2014 లో లే ఆఫ్ ప్రకటించి చెరుకు రైతులను కడుపుకొట్టిన ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీదని ఆయన మండిపడ్డారు. లే ఆఫ్ ప్రకటించిన నాటి నుండి నిజాం షుగర్స్ పై స్పష్టత ప్రకటించకుండా ప్రవేటీకరణ చేసి, నిజాం షగర్స్ ఆస్తులను అమ్ముకునేందుకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాటుపడ్డారని ఆయన ఆరోపించారు. మొత్తంగా మూడు యూనిట్ లు బోధన్, మెదక్, మెట్ పల్లి యూనిట్ లతో కలుపుకోని సుమారుగా 407 కోట్ల రూపాయల అప్పులను ఆనాటి ప్రభుత్వం మిగిల్చిందని ఆయన అన్నారు. అనంతరం 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో నిజాం షుగర్స్ కర్మాగారాలపై స్పష్టత తీసుకువస్తామని చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని, అందుకే ముఖ్యమంత్రి స్వయంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దీకరణ కమిటీని వేయడమే కాకుండా కమిటీ ఏ నిర్ణయం తెలుపుతదో ఆ నిర్ణయం ప్రకారం నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఆయన అన్నారు. మూడు చక్కెర కర్మాగారాలపై ఉన్న అప్పులను ఓటిఎస్ పద్ధతి ద్వారా 51శాతం రాయితీతో నెలల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వానికి సూచించినట్లు కమిటీలో పేర్కోన్నామని తెలిపారు.
నిజాం షుగర్స్ మెదక్ ప్రాంతానికి వరం…
నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మెదక్ నియోజక వర్గ ప్రాంతానికి, ఇక్కడి రైతులకు ఒక వరం అని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ న్నారు. ఇక్కడి రైతాంగం సుమారుగా 11 వేల ఎకరాల్లో చెరుకును పండించి ఇదే మంబోజిపల్లి ఫ్యాక్టరీలో సుమారుగా 11 వేల ఎకరాల చెరుకు క్రష్షింగ్ జరిగేదని ఆయన అన్నారు. త్వరలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్దీకరణపై ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఇక్కడి రైతాంగానికి తీపికబురు అని ఆయన పేర్కోన్నారు.
నిజాం షుగర్స్ పునప్రారంభంపై రైతాంగం హర్షం.
పదేండ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వం నమ్మించి రైతన్నలను దగా చేసిందని మెదక్ నియోజక వర్గ చెరుకు రైతన్నలు వాపోయారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో చెరుకు పంటను పండించి అప్పుల పాలయ్యామని, తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితినే రైతన్నలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంప్లలి రోహిత్ వంద రోజుల్లో ప్రభుత్వం చర్చించడమే కాకుండా కమిటీని ఏర్పాటు చేసేందుకు చేసిన కృషి అనిర్వచనం అని అన్నారు. తిరిగి నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తే చెరుకు రైతన్నలకు నూతన జీవితాలను ప్రసాదించినట్లు అవుతుందని మెదక్ నియోజ వర్గ రైతాంగం డా. మైనంపల్లి రోహిత్ ను కోరుతున్నారు.