Reporter-Silver Rajesh Medak.
Date-10/04/2024.
వంద రోజుల్లోనే నియోజక వర్గంలో అభివృద్ధి పరుగులు
వివిధ పథకాల ద్వారా 15 కోట్ల రూపాయల నిధులు
టిఎస్ఎఫ్ఐడిసి పథకం ద్వారా 62.11 కోట్ల రూపాయలు
మెదక్ పట్టణంలో చౌరస్తాల సుందరీకరణతో పాటు పార్క్ నిర్మాణం
తెలంగాణ రాష్ర్టంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపి సీటురాదు
మెదక్ పార్లమెంట్ స్థానాని కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకుంటుంది
మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్.
…………………………………………………………………
గత పదేండ్ల బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరిగినాయ అంటే బూతద్దంలో పెట్టి చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు. ఎక్కడ చూసినా అవినీతి లెక్కలు తప్ప అభివృద్ధిని చేసిన పాపాన పోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరుగ్యారెంటీల పథకాల అమలుతో పాటు నియోజక వర్గాలను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆయన అన్నారు. మెదక్ నియోజక వర్గానికి ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ద్వారా 15 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు, ఎస్.డి.ఎఫ్., ద్వారా 10 కోట్ల రూపాయల అభవృద్ధి పనులతో పాటు మెదక్ పట్టణానికి టిఎస్ఎఫ్ఐడిసి ద్వారా 37.5 కోట్లు, రామాయంపేట పట్టణ అభివృద్ధి పనులకు 25.06 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను శంఖుస్థాపన చేసుకున్నామని ఆయన తెలిపారు. మొత్తంగా నియోజక వర్గ అభివృద్ధికి వంద రోజుల్లో రూ. 88.00 కోట్లతో శ్రీకారం చుట్టామని ఆయన పేర్కోన్నారు. అలాగే పట్టణాలను సుందరీకరించుకునేందుకు అందమైన చౌరస్తాల నిర్మాణంతో పాటు మెదక్ పట్టణంలో పార్క్ నిర్మాణం, మెదక్ ఖిల్లా ను అభివృద్ధి పర్చడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మరింతగా అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకోని మెదక్ నియోజక వర్గాన్ని అభివృద్ధిలో మొట్టమొదటి స్థానంలో ఉంచుతానని ఆయన తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ర్టంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదని ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తెలిపారు. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ఇంధిరా గాందీ గెలిచిన తరువాత నేడు మా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన తెలిపారు. మెదక్ ఎంపి స్థానాని కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిప్ట్ ను ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు.