మంత్రి సీతక్క గారి వ్యక్తిగత సహాయకుడు బండారి సతీష్ గారి తండ్రి మరణించగా వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు…
మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు…
తేదీ: 10.04.2024 బుధవారం అనగా ఈరోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల కేంద్రానికి చెందిన మంత్రి సీతక్క గారి వ్యక్తిగత సహాయకుడు బండారి సతీష్ గారి తండ్రి గారైన బండారి వెంకటేశ్వర్లు గారు గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవిచందర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవి యాదవ్, INTUC జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ గుండెబోయిన నాగలక్ష్మి – అనిల్ యాదవ్, సిద్దబత్తుల జగదీశ్వర్ రావు, చల్వాయి గ్రామ కమిటీ అధ్యక్షుడు వేల్పుగొండ పూర్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.