Reporter -Silver Rajesh Medak.
తేది – 08.04.2024.
గంజాయి ఇతర మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం భాగస్వామ్యం కావాలి
డ్రగ్స్ ని రూపుమాపడంలో ప్రతి ఒక్కరు సహకరించండి.
గంజాయి రవాణాకు పాల్పడితే పీడీయాక్ట్.
ఈ రోజు గౌరవ మల్టీ జోన్ – I ఐ.జి.పి శ్రీ.ఎ.వి.రంగనాథ్, ఐ.పి.ఎస్ గారు మల్టీ జోన్ – I జిల్లాల ఎస్.పి లు సి.పి ల పోలీస్ అధికారులతో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణ, వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశాల పైన దృశ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్.పి. గారు జిల్లా పోలీస్ అధికారులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా గౌరవ మల్టీ జోన్ – I ఐ.జి.పి శ్రీ.ఎ.వి.రంగనాథ్, ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ…. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి ప్రదేశాలను గుర్తించాలని గంజాయి సేవించే వ్యక్తులను గుర్తించి వారి ద్వారా గంజాయి ఎక్కడ నుండి సప్లై చేస్తున్నారు అనే సమాచారాన్ని సేకరించాలి. జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలు సమూలంగా నిర్మూలించాలి. అభివృద్ధికి అవరోధంగా గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు లేకుండా చేయ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.
యువతను ప్రజలను రక్షించవలసిన బాధ్యత మన పైనే ఉందన్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో ఎన్నో చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు చేసే అవకాశం ఉన్నందున ముందుగానే దాన్ని నిర్మూలించాలన్నారు. ప్రతి పోలీస్ అధికారి ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకుని గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు సేవించకుండా విక్రయించకుండా నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు,ఈ విషయం గురించి ప్రజల్లో మెరుగైన చైతన్యం కొరకు పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. లాడ్జీలు, బస్టాండ్లు, కాలేజీలు, లేబర్ అడ్డాలు తదితర ప్రదేశాల పై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా జిల్లా సిబ్బంది పని చేయాలని సిబ్బందిని సూచించారు.
గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల నియంత్రణలో పూర్తిస్థాయిలో సమూలంగా నియంత్రించాలని అందుకోసం హోంగార్డు నుండి పై స్థాయి అధికారి వరకు కష్టపడాల్సి వుంటుందని కావున ప్రతి వ్యక్తి మాదకద్రవ్యాలకు సంబందించి ఎటువంటి సమాచారం ఉన్న తమ వంతు భాద్యతగా పోలీసులకి వెంటనే తెలియపరచాలని కొరారు. ఇందుకోసం పోలీస్ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి మరియు గుట్కా రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించడంతో పాటు వారి ప్రస్తుత స్థితిగతులపై ఆరాతీయడం, గంజాయి వినియోగించే వారి సమాచారాన్ని కూడా అధికారులు సేకరించాల్సి వుంటుందని. గంజాయి రవాణాకు పాల్పడేవారి సమాచారాన్ని తెలుసుకోనేందుకుగాను పటిష్టమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు తీసుకోవాలని సూచించారు.
గంజాయి నియంత్రణలో ప్రతిభ కనబరిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో రివార్డు మరియు మంచి గుర్తింపు లభిస్తుందని ముఖ్యంగా గంజాయి నియంత్రణ తాత్కాలికంగా కాకుండా శాశ్వతం నియంత్రించే మార్గాలపై అధికారులు సిబ్బంది దృష్టి పెట్టాలని, గంజాయి కట్టడికి పోలీస్ అధికారులు నైపుణ్యంతో కూడిన యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని సూచించారు.అదే విధంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలేజీలపై దృష్టి సారించాలని, గంజాయి అమ్మకాలు, వినియోగం వలన జరిగే పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రతి గంజాయి రవాణా, సాగుకు పాల్పడే వారి మూలాలను గుర్తించి వారిని పట్టుకోవాలని, గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై అవకాశాన్ని బట్టి వారిపై పీడీయాక్ట్ లను నమోదు చేయడంతో పాటు గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టాలని సూచించారు.
గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే మెదక్ జిల్లాపోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి మరియు మత్తు పదార్థాల విషయంలో చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ సామీక్షా సమావేశంలో జిల్లా ఎస్.పి తో పాటు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ.ఎస్.మహేందర్ తూప్రాన్ డి.యెస్.పి శ్రీ.వెంకట్ రెడ్డి మరియు మెదక్ డి.ఎస్.పి రాజేశ్వర్ జిల్లా సి.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.