*స్టూడియో 10 టివి న్యూస్ ఏప్రిల్ 08, నిజామాబాద్ జిల్లా**చదువు అర్థం కావడం లేదని విద్యార్థి ఆత్మహత్య*నవీపేట్ మండల్ : చదువు అర్థం కావడం లేదని ఓ విద్యార్థి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాంచలో చోటు చేసుకుంది. నాగేపూర్ కు చెందిన సూర్య తేజ (18) ఇటీవల ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా నిన్న తల్లిదండ్రుల ఎదుట ఎంసెట్ కోచింగ్ అర్థం కావడం లేదని మొరపెట్టుకున్నాడు. దీంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి గోదావరి నదిలో దూకాడు.