Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
08.04.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ…జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు తెలుగు సంవత్సరాది ఉగాది పండగ మరియు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేసినారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని మరియు రంజాన్ పండగని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు , పోలీస్ అధికారులకు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తీపి చేదు షడ్రుచులు కలగలిపి ఆస్వాదిస్తూ శాంతి సౌభాగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగ, ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్ పండగలు ఏకకాలంలో వస్తున్నందున కులమతాలు వేరైనా మొదటిగా మనమందరం భారతీయులమన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. వివిధ మతాలకు చెందిన పండగలు ఏకకాలంలో వస్తున్నాయని, ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే మత సామరస్యం నెలకొంటుందన్నారు.ఎలాంటి గొడవలకు తావులేకుండా, కుల-మతాలకు అతీతంగా శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని ఎస్పీ గారు సూచించారు. సంఘవిద్రోహశక్తులు ఎవరైనా మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన, సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేసినా వారిపైన చట్ట పరంగా కఠిన చర్యలుంటాయన్నారు.
ప్రజలకు పూర్తి భరోసా భద్రత కల్పిస్తామని, పండుగల సందర్భంగా ఇతర మతస్తులను గౌరవిస్తూ పండగలు జరుపుకోవాలని, జిల్లా ప్రజలు ఐక్యతను చాటాలని, అలాగే పండగ సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.