Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
తేది -08.04.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం మండలం చేవెళ్ల గ్రామానికి చెందిన బోరంచ మల్లయ్య తనకు చేవెళ్ల గ్రామ శివారులో సొంత పట్టా భూమి సర్వే నంబర్ 43/లు రక్బ మూడు ఎకరాలు మరియు సర్వేనెంబర్ 68/అ2/.05 కలవాటిని మా అన్న అయిన బోరంచ గోపాల్ దౌర్జన్యంగా నా యొక్క సొంత భూమి నాకు తెలియకుండా ట్రాక్టర్ వేసి దున్నినాడు అని కావున నాయందు దయ తలచి దౌర్జన్యంగా నా పొలం దున్నిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని అల్లాదుర్గ్ సి.ఐ. గారికి సూచనలు చేయటం జరిగింది. అలాగే మెదక్ పట్టణం కోలిగడ్డకు చెందిన అల్లిపురం నాగరాణి మా అమ్మ చనిపోయిన తర్వాత మా అమ్మ డ్యూటీ నాకు వచ్చిందని నా ఆరోగ్యం బాగా లేకపోవడంతో నేను ఆ డ్యూటీని మా చెల్లెలు కి ఇచ్చినానని అందుకు గాను మా చెల్లెలు నా యొక్క బాగోగులు చూసుకుంటానని చెప్పిందని తాను డ్యూటీలో చేరి ఆరు నెలలు కావస్తున్న నా బాగోగులు చూసుకోకుండా నాకు తిండి కూడా పెట్టడం లేదని నా తల్లి నా పేరున రాసిన ఇంటిని తానే తీసుకున్నదని నాకు రావాల్సిన ఆస్తులు నా చెల్లెలు అనుభవిస్తున్నదని కావున నాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ పట్టణ సి.ఐ.కి సూచనలు చేయటం జరిగింది.