పాలకుర్తి నియోజకవర్గం తేదీ : 07 – 04 – 2024
పాలకుర్తి మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు..
పచిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని పాలకుర్తి మండల కేంద్రంలోని భాషరత్ ఫంక్షన్ హల్ లో ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు..
రోజ ముగిసిన అనంతరం ముస్లింలతో కలిసి పాలకుర్తి మండల కేంద్రంలో స్థానిక భాషరత్ ఫంక్షన్ హల్ లో ఇఫ్తార్ విందు ఆరగించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు మాట్లాడుతూ.. పండుగలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని మానవాళి శ్రేయస్సు కోసం నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష పాటించడం అభినందనీయం అని కొనియాడారు..
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మతసామరస్యం కోసం పాటుపడుతుంటే, బిజెపి పార్టీ మాత్రం మతాల మధ్య చిచ్చు పెడుతోందని వాపోయారు, ప్రస్తుత ఎలక్షన్ల అనంతరం తమ సమస్యలు దరఖాస్తు రూపంలో అందజేసినట్లయితే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి గారు ముస్లిం సోదరులకు సూచించారు..
అంతకుముందు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి గార్లను ముస్లిం మతపెద్దలు పూలమాలలు సాలువాలతో ఘనంగా సన్మానించారు..
కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ , ఎర్రబెల్లి రాఘవరావు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు..