Venkatramulu, Ramayampet Reporter
మెదక్ ఉమ్మడి జిల్లాలలో గత మూడు దశాబ్దాలుగా రక్త అవయవ దానాలపై విస్తృత ప్రచారం గావిస్తూ, 52 మార్లు స్వయంగా రక్తదానం చేసి లయన్స్ క్లబ్బుల ద్వారా రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఇప్పటివరకు 4,127 యూనిట్లను సేకరించినందుకు రెడ్డి గర్జన జాతీయ మాసపత్రిక ఎడిటర్ గుర్రం పాపిరెడ్డి మరియు అవార్డుల కమిటీ మెంబర్ల ద్వారా రామాయంపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డికి శ్రీ కోది నామ సంవత్సర ఉగాది పురస్కారానికి ఎంపిక చేసి ఆదివారం సాయంత్రం సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియం తెలంగాణ స్టేట్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో ఉత్తమ రక్తదాతగా, రక్తదాన శిబిరంల నిర్వహణకు గాను ఎంపిక చేసి రెడ్డి గర్జన జాతీయ మాసపత్రిక ఎడిటర్ గుర్రం పాపిరెడ్డి మరియు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది. తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 14 రంగాలలో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులను ప్రధానం చేయడం జరిగింది సామాజిక సేవ, వైద్య, కళలు, విద్యారంగం, ఆరోగ్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగంలో సామాజిక సేవలు అందిస్తున్న ప్రముఖులను సన్మానించడం జరిగింది.కాగా మెదక్ జిల్లా నుండి రాజశేఖర్ రెడ్డి యన్స్ క్లబ్ ద్వారా రెడ్ క్రాస్ సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరములు, ఆరోగ్య శిబిరంలు,విద్యార్థులకు ప్రోత్సాఖాలు, వృద్ధులకు చేయూత వంటి వివిధ సేవా కార్యక్రమాల సేవలను గుర్తించి సామాజిక సేవా రంగంలో ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. ఉత్తమ సామాజిక సేవకుడిగా,రక్తదాతగా అవార్డును అందుకున్న లయన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డిని పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి ,కోమటి రెడ్డి బుచ్చి రెడ్డి, రజని రెడ్డి, పలువురు విద్యావంతులు, సామాజిక సేవకులు అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ రెడ్డి సంఘాల నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.