ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ మున్సిపల్ కమిషనర్ దేవేందర్
Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-2025 సంబంధించి ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వపరంగా రాయితీ కల్పించిందని సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమీషనర్ దేవేందర్ ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని పట్టణం గ్రామాలలో ఆస్తిపన్ను చెల్లించే ప్రజలు మీ ఆస్తి పన్ను 1లక్ష రూపాయలు ఉంటే 95 వేలు చెల్లించాలని 1000 రూపాయలు ఉంటే 950 చెల్లించాలని 500 ఉంటే 475 చెల్లించే విధంగా ప్రభుత్వం ఐదు శాతం రాయితీని కల్పించిందని పేర్కొన్నారు.ఈ నెల ఏప్రిల్ 30వ తేదీలోగా మీ ఆస్తి పన్ను చెల్లించినట్లయితే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.అలాగే రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ అధికారులకు ప్రజలు సహకరించి మీ ఆస్తి పన్నులు వెంటనే చెల్లించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.