రఘునందన్ రావు గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు బిజెపి నాయకుల ప్రచారం

Venkatramulu, Ramayampet Reporter

మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఆదివారం నాడు బిజెపి కార్యకర్తలు , నాయకులు బిజెపి మెదక్ ఎంపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు అంటూ బిజెపి పట్టణ సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి రఘునందన్ రావు ను గెలిపించాలని ఇంటింటికీ ప్రచారం చేయటం జరిగిందన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు దేశం కోసం జరిగే ఎన్నికలు ఈ ఎన్నికల్లో మోదీ గారు మూడవ సారి ప్రధానిగా కాబోతున్నారని తెలిపారు.రామాయంపేట పట్టణ ప్రజలందరూ బిజెపికి ఓటు వేసి దేశం బాగుండాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే పేదలు, యువత, రైతులు, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభవృద్ధి అవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం కొసం బిజెపి పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈనాడు తెలంగాణ అభివృద్దిలో కేంద్రం ప్రభుత్వ పాత్ర కీలకం 10 ఏళ్లలో లక్షల కోట్ల రూపాయల నిధులను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వనిదే అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జె.శంకర్ గౌడ్, కొడపర్తి నరేందర్, మేకల. లావణ్య, కమ్మరి యాదగిరి,వోలిస. సతీష్ రావ్, నిమ్మల. స్వామి, బండి గిరి, బాసఓ అనిల్,నరేష్ యాదవ్, సాయి తేజ కార్యకర్తలు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!