Venkatramulu, Ramayampet Reporter
మాల మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రాజ్యాంగ రక్షణ యాత్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేటకు ఈ రక్షణ యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా రామాయంపేట మాల మహానాడు మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. వారు మొదటగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాల మహానాడు జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ సైనిక దళ కన్వీనర్ పురుషోత్తం, రాష్ట్ర పోలీట్ బూర్యో చేర్మెన్ శ్రీ రాములు,మెదక్ జిల్లా మాల మహానాడు మాజీ అధ్యక్షులు మాసాయిపేట మల్లేశం, మండల అధ్యక్షులు బైరం సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.