నాణ్యమైన మద్దతు ధర కల్పించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Reporter -Silver Rajesh Medak.

మెదక్ తేదీ.06.4.2024

నాణ్యమైన మద్దతు ధర కల్పించడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

దళారులు నమ్మి మోసపోవద్దు

. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి కలెక్టర్.

వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి జిల్లా వ్యాప్తంగా 410 కొనుగోలు కేంద్రాలు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి

గ్రేడ్ ఏ రకానికి రూ.2203

గ్రేడ్ బీ రకానికి రూ.2183

కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.

శనివారం రబీ సీజన్ (2023-24) ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో భాగంగా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్స్, ఐకెపి, మార్కెటింగ్, శాఖల ద్వారా 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఐకెపి ద్వారా ఈరోజు వరకు (91 ) కొనుగోలు కేంద్రాలు, ఫ్యాక్స్ ద్వారా (46) మొత్తం వరకు(137) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, మిగిలిన సెంటర్స్ పూర్తిస్థాయిలో రెండు రోజుల్లో రైతులకు అందుబాటులోకి వస్తాయని వివరించారు రైతులు కాయకష్టం చేసి అహర్నిశలు కష్టపడి వరి పంటను పండిస్తారని, రైతుకు భరోసా కల్పిస్తూ మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా దాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, అన్నారు

ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు.

నిర్దేశించిన బరువుకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.

రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూకేంద్రాలకు తరలించాలని సూచించారు.

రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోళ్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రభుత్వం  గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2203,  గ్రేడ్ బీ రకానికి రూ.2183 నిర్ణయించినందని వెల్లడించారు.

కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మహమ్మద్ నగర్ సీఈవో దుర్గయ్య, ఏ డి ఏ పుణ్యావతి, మండల అభివృద్ధి అధికారి టి శ్రీనివాస్, ఐకెపి ఎపిఎం దుర్గా గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!