ఈరోజు (06-04-2024) శనివారం నాడు చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” గారి చేవెళ్ల లోని ఇంద్రారెడ్డి చౌరస్తా నందు రైతులకు మద్దతుగా నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు పట్లోళ్ల. సబితా ఇంద్రారెడ్డి గారు.
రైతు దీక్ష లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా రైతు వ్యతిరేక విధానాలు అవాలంభిస్తోందని ఆరోపించారు. సాగు నీరు ఇవ్వకుండా, రైతు బంధు, రుణ మాఫీ వంటి పథకాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. వరి పంటకు బోనస్ ఇవ్వకుండా, ఎండిపోయిన పంటలకు నష్ట పరిహారం ప్రకటించకుండా రైతులను మోసం చేస్తోందన్నారు.
గత ప్రభుత్వాన్ని బదులం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని, రైతుల పంటలు ఎండిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 24 గంటల కరెంట్ ఇస్తామని సగం కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని మండి పడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం రూ. 15 వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. మండుటెండల్లో రైతులకు నీళ్లు తాపే సోయి కాంగ్రెస్ వారికి లేదని మిషన్ భగీరథ నీటిని గత ప్రభుత్వం అందించిందని దాన్ని కొనసాగించలేని స్థితిలో కాంగ్రెస్ దద్దమ్మలు ఉన్నారన్నారు. ఎంపీ ఎన్నికలకు ముందు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కోడ్ ను సాకుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తప్పని సరిగా బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పై బురద జల్లడం మాని ఎన్నికల హామీలను నెరవేర్చే విధంగా పని చేయాలని సూచించారు. ఈ దీక్షలు ఆరంభం మాత్రమేనని మా పార్టీ ఉద్యమ పార్టీని అని మళ్లీ ఉద్యమ బాట పడుతామని వేటాడి వెంటాడుతమని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి BRS పార్టీ ముఖ్య నాయకులు మరియు BRS పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.