నార్సింగి : మండల వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రారంభించారు. శేరిపల్లి గ్రామంలో నార్సింగి తహశీల్దార్ షేక్ కరీం ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించగా, మండల కేంద్రం లో పీడీ డీ ఆర్డీవో శ్రీనివాస్ రావు తహశీల్దార్ సమక్షంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రాభించారు. అనంతరం తహశీల్దార్ మీడియా తో మాట్లాడుతూ జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశానుసారం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా ఐదు డీ ఆర్డీఓ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను నార్సింగి, శేరిపల్లి, జప్తి శివనూర్, సంఖాపూర్, నర్సంపల్లి లలో ఏర్పాటు చేశామని, రైతులు తమ వడ్లను కొనుగోలు కేంద్రాల వద్దనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. షేక్ కరీం మాట్లాడుతూ ఏ గ్రేడ్ వడ్ల ధరను 2203, సాధారణ గ్రేడ్ ధరను 2183 గా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. తేమ శాతం 17 కు మించ రాదని, చెత్త తాలు 1 శాతం, మట్టి తెల్ల రాళ్ళు 1 శాతం, చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యం 5 శాతం, పూర్తిగా తయారు కాని, ముడుచుకుపోయిన ధాన్యం 5 శాతం, తక్కువ రకం మిశ్రమం 6 శాతం మించకూడదని సూచనలను చేశారు. రైతులు వారు పండించిన ధాన్యాన్ని వారి వారి కల్లాల వద్దనే ఎండ బెట్టి కొనుగోలు కేంద్రానికి తేవాలని, వడ్లను తెల్లవారు జామున తేవాలని, ఎండలు బాగా కాస్తుండడం వల్ల రైతులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వడ్లు విక్రయించే రైతులు తమ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం, పట్టా పుస్తకం వెంట తీసుకురావాలని, కొనుగోలు కేంద్రంలోని వడ్లను అమ్ముతూ సొసైటీ అధికారులు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, పీడీ డీఆర్డీవో లతో పాటు ఎంపీ ఓ నరేష్, వ్యవసాయ అధికారిని దివ్య, వీఓఏ రామచంద్రం, పంచాయితీ కార్యదర్శి నాగరాజు, ఐకేపీ ఏపీఎం అశోక్, సీసీ శంకర్, సీసీ సుల్తానా, కమిటీ సభ్యురాలు లక్ష్మి నరసమ్మ, విశాలాక్షి, స్వప్న, అనురాధ, మల్లీశ్వరి రైతులు పాల్గొన్నారు.