Reporter -Silver Rajesh Medak.
తేదీ.6.4.2024.
పక్కా ప్రణాళికతో నీటి ఇబ్బందులను అధిగమించాలి శుద్ధిచేసిన త్రాగునీరు సరఫరా చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక కార్యాచరణ క్షేత్రస్థాయిలో మెదక్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసి స్వయంగా తాగునీటి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్న కలెక్టర్
సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ బోర పట్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును పరిశీలించిన కలెక్టర్
నర్సాపూర్ మండలంలోని ,లింగాపూర్ రుస్తుంపేట గ్రామాలలో క్షేత్రస్థాయి పర్యటన
ఇంటికి సమృద్ధిగా త్రాగునీరు సరఫరా చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం
జిల్లాలో వేసవి కాలంలో త్రాగు నీరు ఇబ్బందులు రాకుండా అధికారులు సమన్వయం తో పని చేస్తూ త్రాగు నీటి సరఫరా చేయాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.శనివారం తాగునీటి సమస్యలను క్షేత్రస్థాయి స్వయంగా తెలుసుకుని పరిష్కార మార్గాలపై నివృత్తిలో భాగంగా సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ బోర పట్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నర్సాపూర్ మండలం రుస్తుంపేట, లింగాపూర్ గ్రామాలలో సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు.
మిషన్ భగీరథ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ త్రాగునీటిని శుద్ధి చేస్తూ సరఫరా చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండల్ బోర పట్ల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు ద్వారా నర్సాపూర్ నియోజకవర్గంతో 496 గ్రామాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని, నీటి సరఫరా లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రస్తుతం గ్రామాలకు అందుతున్న ,త్రాగు నీటి సరఫరా కోసం సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నందున శుద్ధి చేసిన మిషన్ భగీరథ ద్వారానే ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామాల్లో, పట్టణాల్లోనూ చివరి నివాస ప్రాంతం వరకు నీరు చేరేలా చూడాలన్నారు.సంక్షోభ సమయంలోనే మన పని తీరు పరీక్షకు గురవుతుందని, చెప్పారు.
స్థానికంగా ఉన్న ఇతర నీటి వనరులు వినియోగించాలని ఆయన తెలిపారు. వ్యవసాయ ఆధారిత బోర్ వెల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించి సిద్ధం చేసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథలో అందుబాటులో ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది షిప్టుల వారిగా 24 గంటలు పని చేస్తూ డిమాండ్ మేరకు అవసరమైన నీరు గ్రామీణ ప్రాంతాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో ప్రతి ఇంటికి ప్రణాళిక బద్ధంగా నీటి సరఫరా చేయాలని , వివరించారు.
అనంతరం లింగాపూర్ రుస్తుంపేట గ్రామంలో ఇంటింటికి తిరిగి తాగునీటి కొరత ఏమైనా ఉన్నదా మిషన్ భగీరథ నీరు ఏ సమయంలో వస్తుంది. గ్రామంలో ప్రజలను నీటిసరఫరా తీరును అడగగా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.అంతకు ముందు కలెక్టర్ ఓవర్‌హెడ్ ట్యాంకులను, బోర్ల ను పరిశీలించి నీరు ప్రజలకు తగినంతగా సరఫరా చేస్తున్నారా అని కార్యదర్శులను అడిగితెలుసుకున్నారు. మిషన్ భగీరథ తాగునీటి సరఫరా అనివార్య కారణాల వలన నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. నీటి సరఫరా లో ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిష్కరించాలని అన్నారు. త్రాగునీటి సరఫరాలో ఏర్పడే ఇబ్బందులు వెంటనే తెలియజేయాలని, సమస్య తీవ్రత పెరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
స్థానికంగా ఉన్న నీటివనరులు, బోరు బావులను తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో ప్రతిరోజు పర్యటించి సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. నీటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ E.E కమలాకర్, ఇంట్రా E.E సంపత్ కుమార్ నర్సాపూర్ ఎంపీడీవో మధులత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.