Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో నేడు భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినత్సవం సందర్భంగా పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం 8వ వార్డులో శనివారం నాడు పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేసి ఘనంగా ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచంలో భారత మాతను విశ్వ గురువుగా నిలిపే యజ్ఞంలో భాగమైన పార్టీ కార్యకర్తలకు ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎందరో కార్యకర్తలు,నాయకుల బలిదానాల పునాదులపై నిర్మితమై కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అనుక్షణం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజెపి నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ, అతిపెద్ద కార్యకర్తల సమూహం ఉన్న పార్టీ ఆయన కొనియాడారు.భారతీయ జనతా పార్టీ. క్రమశిక్షణ,దేశ భక్తి జాతీయ వాద సిద్దాంతాలతో దేశ భక్తి మరియు కార్యకర్తలను నాయకులుగా తయారు చేసే పార్టీ బిజెపి స్వాతంత్య్రం వచ్చాక 75 ఏళ్లు పూర్తి చేసుకొని అమృతోత్సవాలు జరుపుకున్నామని పేర్కొన్నారు.రాబోయే 2047 వరకు 100 సంవత్సరాలు అవుతుందని అనుకున్న లక్ష్యాలను సాధించడానికి దేశాన్ని మొదటి స్థానంలో తీసుకుపోవడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అడుగులు వేయడం జరుగుతోందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, 8వ వార్డు అధ్యక్షులు నరేష్, జనరల్ సెక్రెటరీ సాయి,ఎల్లం గౌడ్, కటిక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.