కాంగ్రెస్ అగ్ర నేతలు హాజరవుతున్న మహాసభకు కదిలిన మహిళా నేతలు…
మంత్రి సీతక్క గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారి సూచనల మేరకు, జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షురాలు మద్దలి నాగమణి గారి అధ్యక్షతన సభకు బయలుదేరిన మహిళా నాయకురాళ్ళు…
తేదీ: 06.04.2024 శనివారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షురాలు మద్దాల నాగమణి గారి ఆధ్వర్యంలో తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభకు బయలుదేరిన మహిళా సోదరీమణులు, కాంగ్రెస్ నేతలు, ఇట్టి భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మరియు ప్రియాంక గాంధీ గారు ముఖ్య అతిధులుగా హాజరవుతున్న శుభ సందర్భంగా మండల మహిళా నేతలు సభను విజయవంతం చేయడానికి తమ వంతు కృషిగా బయలుదేరారు. ఈ సందర్భంగా నాగమణి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతావనికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ, అరవై యేండ్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన పార్టీ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దొరల పాలనలో తెలంగాణ రాష్ట్రం చితికి ఛిద్రం అయిందని, తెలంగాణ ప్రజలు దొరను గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారని అలాగే కేంద్రంలో కూడా మతతత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీనీ గద్దె దింపడమే లక్ష్యంగా ప్రజలందరూ పని చేస్తున్నారని, కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వడం ఖాయమని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తూ, రెగ్యులర్ పోస్టులు వేస్తూ, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ, ఆరు గ్యారంటిల అమలుకు శ్రీకారం చుడుతూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి ద్వారా మహిళలకు ఉచిత విద్యుత్ పథకం, ఆరోగ్య శ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స లాంటి పథకాలు అమలు చేసి మహిళల్ని మహరాణుల్ని చేయడమే లక్ష్యంగా కదులుతున్న రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా నెలకు 2500 రూపాయలు ఇవ్వడానికి, ఆర్ పేదలకు ఇందిరమ్మ ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, పేదరిక నిర్మూలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు. అలాగే నేడు తుక్కుగూడలో పార్లమెంట్ ఎన్నికల కోసం దేశంలోని మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోను విడుదల చేయనుంది, అందుకే భారీగా మహిళామణులు అందరూ తుక్కుగూడ సభను విజయవంతం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తెనే సామాన్యుడు బ్రతుకుతాడని, బీజేపీ పార్టీలో నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి అని, బీజేపీ పార్టీ పేదరిక నిర్మూలనా కోసం కృషి చేసిన దాఖలాలు కూడా లేవని అన్నారు. పేదల నేస్తం హస్తం మాత్రమే అని హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ మహిళా నాయకురాళ్ళు మరియు మహిళా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.