స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 05, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ఉప లోకాయుక్త పి.రజనీ కుటుంబ సభ్యులతో,కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి శ్రీనివాస రావు కుటుంబ సభ్యులతో శుక్రవారం పూజలు నిర్వహించారు. వీరిని ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించుకున్నారు. పూజల అనంతరం ఈవో శేష వస్త్రాలతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేయగా,వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరి వెంట మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్, ఆలయ ఏఈవో మధు, తదితరులు పాల్గొన్నారు.