పరంపోగు ఇనం భూములకు శాశ్వత పట్టాలు కల్పించాలి
విద్యకు చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి
పరంపోగు ఇనం భూములకు, విద్య హక్కు చట్టం అమలుకై మాదిగ వాడలో పల్లెనిద్ర కార్యక్రమం చేపడతామని, తెలంగాణ దండోరా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మీసాల రామన్న మాదిగ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మీసాల రామన్న మాదిగ మాట్లాడుతూ…. ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మాదిగలను చైతన్యం చేయడం కోసం, మాదిగలకు రావలసిన హక్కులను అమలుకై, మరి అదేవిధంగా విద్య హక్కు చట్టం అమలయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడం కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో నిర్వహించే పల్లెనిద్ర కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ, రాష్ట్ర కార్యదర్శి మంతటి గోపి మాదిగ, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బోల్లె విష్ణు మాదిగ, జిల్లా నాయకులు దర్శనాల సాయికుమార్, ఎల్లయ్య, నరసింహ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.