అన్నగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి
సామ్రాజ్యవాదాలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన స్వతంత్రోద్యమం కుల నిర్మూలన కోసం జరిగిన సామాజిక సంస్కరణ ఉద్యమాలు జరిపిన భారతమాత కన్న ముద్దుబిడ్డ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు భారత దేశ స్వరాజ్య ఉద్యమాలతో తధానంతరం జరిగిన దేశ పునర్నిర్మానంలో ముడిపడిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం రాజకీయ సామాజిక చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది జగ్జీవన్ రామ్ ని స్మరించుకోవడం అంటే భారతదేశ స్వతంత్రం సామాజిక ఉద్యమాల ప్రాంగణాన జరిగిన ఉప్పొంగిన సమరజ్వాల సమున్నత ఘటాలను గుర్తు చేసుకోవడమే జగ్జీవన్ రామ్ మహోన్నత నాయకత్వం వ్యక్తిత్వం సేవలు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు సంస్థలకు మహాబలాన్ని చేకూర్చిపెట్టాయి భారత రిపబ్లిక్ తొలి సభ (1952) తో ప్రవేశించిన జగ్జీవన్ రామ్ వరుసగా 8సార్లు గెలిచారు 33 సంవత్సరాలు కేంద్రమంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించాడు మొదటి శ్రేణి పార్లమెంటరీయన్ గా నిలిచారు.హేతుబుద్ధి సానుకూల దృక్పథం స్పష్టమైన దార్శనికత విస్తృతమైన అధ్యయనం గొప్ప మేధాశక్తి స్థిరమైన సంకల్పబలం నిత్య కృషివళత్వం ఓరిమి కారుణ్యం చర్చించే గుణం ఒప్పించే గుణం ఆత్మవిశ్వాసం ధైర్యం సేవ నిరతి కార్యనిర్వాహణ దక్షత మొదలగు లక్షణాలు నిండుదనంతో బలమైన సుగుణశీల వ్యక్తిత్వం తనకు తాను నిర్మించుకున్న భారత అమూల్య రత్నం డాక్టర్ బాబు జగ్జీవన్ సేవలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి కొనియాడారు.