Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని రామాయంపేట కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మెదక్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు.ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు పాతూరి రాజు,లద్ద నర్సింలు,మల్యాల కిషన్,సాగర్,జంగంపల్లి శంకర్ గౌడ్, పోచమ్మల అశ్విని,శ్రీనివాస్,బొర్ర అనిల్ కుమార్, కటికే కార్తీక్, కాట్రియాల సిద్దులు,గోల్పర్తి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.