Reporter -Silver Rajesh Medak.
తేది -05/04/2024.
- బాబు జగ్జీవన్ రామ్ జీవిత చరిత్ర నేటి తరానికి ఆదర్శవంతం
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్.
నివాళులర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్
ఉన్నత చదువుతోనే మంచి భవిష్యత్ ఉంటుంది.
శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్బంగా స్థానిక ఐడిఓసి కార్యాలయం సమావేశ హల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వాలన చేసి పూల మాలలతో ఘనంగా నివాళులర్పించి బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ జీవితం మన అందరికి ఆదర్శప్రాయమన్నారు.
ఉన్నతమైన చదువు, ఆశయాల తోనే ప్రతి ఒక్కరి జీవితం బాగుపడుతుందన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి పెద్ద ఎత్తున జరుపుకోవడం మహనీయుల జీవిత చరిత్ర నేటి యువత తెలుసుకోవాలని మారుమూల కుటుంబంలో పుట్టి అత్యుత్తమ ఉప ప్రధాని స్థాయికి ఎదగడానికి వారు చేసిన కృషి ఎనలేనిదని మహనీయుల ఆశయ సాధనకు మనందరం పాటుపడాలని, బాబు బాబు జగ్జీవన్ రామ్ అనేక మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఆ పదవులకు వన్నెతెచ్చిన మహానీయుడని కొనియాడారు నేటి యువత మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకుని గుణాత్మకమైన విద్యా విధానాలు నేర్చుకుని ఉన్నత పదవులు చేపట్టి నేటి సమాజం గుర్తుండిపోయేలా సేవా ఫలాలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో డిఆర్ఓ పద్మశ్రీ, డి ఎస్ సి డి ఓ విజయలక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి నరసింహారావు ,తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ అధ్యక్షులు నరేందర్ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ సంబంధిత ఎస్సీ సంక్షేమ శాఖ పాఠశాలల సంక్షేమ అధికారులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు