Reporter -Silver Rajesh Medak.
Date-5/4/2024.
ఘనంగా 116వ బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు
జగ్జీవన్ రావ్ ఆశయాలను సాధిద్దాం
సమాజ సేవకర్తగా ఎనలేని గుర్తింపు పొందిన మహానీయుడు జగ్జీవన్ రాం
కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావ్.
బాబు జగ్జీవన్ రాం పేరొందిన స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, బీహార్లోని వెనుకబడిన వర్గాలనుంచి వచ్చాడని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్, న్యాయవాది జీవన్ రావ్ లు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రాం 116వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 27 ఏండ్లకే ఎమ్మెల్యే గా గెలుపొందిన వ్యక్తి బాబు జగ్జీవన్ రాం అని వారు గుర్తుచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంటులో నలభై ఏళ్ళపాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉపప్రధానిగా వ్యవహరించాడని వారన్నారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో అతను కీలక పాత్ర పోషించాడని పేర్కోన్నారని తెలిపారు. 1946లో జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టాడని గుర్తుచేశారు. అదే విధంగా భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక మంత్రి, భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు.అతను సామాజిక న్యాయం రాజ్యాంగంలో పొందుపరచబడిందని నిర్ధారించారన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా నలభై సంవత్సరాలకు పైగా వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా పనిచేశారన్నారు. మరీ ముఖ్యంగా అతను 1971 ఇండో-పాక్ యుద్ధం జరిగిన సమయంలో భారత రక్షణ మంత్రిగా ఉన్నాడు, ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు సుగమం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు దాయర లింగం, దొంతి లక్ష్మి ముత్యం గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మధుసూదన్ రావ్, మాజీ కౌన్సిలర్ లు తిమ్మన్నగారి అనిల్ కుమార్, గోదల జ్యోతిక్రిష్ణ, పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, మందుగుల గంగాధర్, బొజ్జ పవన్, బోయిని కిష్టయ్య, జిలకరి రాజలింగం, గూడూరి క్రిష్ణ, దాయర రవి, రమేశ్, ఇస్మాయిల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్, గాడి రమేశ్, దయాసాగర్, పద్మ మనోజ్ కుమార్, హరిత, ఎం.ఆర్.పి.ఎస్. నాయకులు బాల్ రాజ్, పోచేందర్, ప్రవీణ్, దేవులా తో పాటు తదితరులు పాల్గోన్నారు.