Reporter -Silver Rajesh Medak.
Date- 05. 05 .2024.
ఓటు వేసేందుకు… ప్రత్యామ్నాయ ధృవీకరణ పత్రాలు ఇవే!
- *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ *
తేది – 05,04, 2024.
మే నెల 13.05.2024 తేదీన జరగనున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)కు ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి కలిగి ఉండాలనీ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.
శుక్రవారం స్థానిక ఐ.డి.ఓసి కార్యాలయంలో Sveep కార్యక్రమంలో భాగంగా పోలింగ్ కేంద్రంలో గుర్తింపు ధ్రువీకరణ ఉపయోగపడే వాల్ పోస్టర్స్ ను సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించిన కలెక్టర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు, తపాల కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ బుక్, కేంద్ర కార్మికశాఖ జారీచేసిన ఆరోగ్యబీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా(ఆర్టీఐ), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్ఎఐ) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్ యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డు (యూడీఐడీ)లు కలిగి ఉండాలనీ జిల్లా కలెక్టర్ చెప్పారు.
బి ఎల్ ఓ లు అందించే ఓటర్ స్లిప్ అనేది పోలింగ్ కేంద్రాల సమాచారం తెలిపేందుకే ఉపయోగపడుతుందని, అది గుర్తింపు కార్డు కాదని అన్నారు.
ఈ వాల్ పోస్టర్స్ ను అన్ని పోలింగ్ కేంద్రాలలో బహిరంగ ప్రదేశాలలో అంటి పెట్టి ప్రచార నిమిత్తం ప్రజలు తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ 12 కార్డులో ఏ గుర్తింపు కార్డు ఉన్న ఓటు వేయవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ sveep నోడల్ అధికారి రాజిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ, జిల్లా పంచాయతీ అధికారి ఎల్లయ్య మత్స్యశాఖ అధికారి నరసింహారావు
తదితరులు పాల్గొన్నారు.