Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావుకు మద్దతుగా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ బిజెపి నాయకులు పట్టణ కార్యాలయం నుండి పట్టణంలో ప్రచార కార్యక్రమం ప్రారంభం చేశారు. అనంతరం పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ రఘునందన్ రావు గెలుపు మెదక్ అభివృద్ధికి మలుపు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో రామాయంపేట బిజెపి సీనియర్ నాయకులు,బిజెపి మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.