కార్మిక, కర్షక లోకానికి దేశ ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆస్పత్రి సూపర్డెంట్ రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది, దళిత సంఘాల నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తర్వాత దళితులు, బహుజనుల అభివృద్ధికి ఉప ప్రధానిగా బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని బత్తుల చంద్రమౌళి తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత, బహుజనులు ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ శృతి, నగేష్, హరికిషన్,రవీందర్, గణేష్ , రవీందర్, వీరస్వామి, ఆశ వర్కర్లు, సివిల్ హాస్పటల్ స్టాఫ్, తదితరులు పాల్గొన్నారు.