మంటలను ఆర్పి వేసిన ఫైర్ అధికారులు
Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట అటవీ ప్రాంతంలో గురువారం నాడు ఫారెస్ట్ అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ విషయం తెలుసుకున్న రామాయంపేట ఫైర్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ తీసుకువెళ్లి మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.ఈ ఫారెస్ట్ అడవిలో సుమారుగా 20 ఎకరాల్లో చెట్లు దగ్ధమైనట్లు 3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారులు పేర్కొన్నారు.ఈ అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఎన్నో అడవి జంతువులు చనిపోయే ప్రమాదం ఉందని ఇప్పటికైనా పారెస్ట్ అధికారులు చొరవ తీసుకొని వన్యప్రాణులను మరియు అటవీ సంపదను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.