చెక్ పోస్ట్ హెల్పర్ పై చిరుత పులి దాడిస్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 04, మహానంది:టోల్గేట్ వద్ద చెక్ పోస్ట్ హెల్పర్ పై చిరుత పులి దాడి చేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పచ్చర్ల టోల్గేట్ వద్ద దస్తగిరి అనే వ్యక్తి చెక్ పోస్ట్ హెల్పర్ గా విధులు నిర్వహిస్తుండగా, చిరుత పులి అకస్మాత్తుగా వెనకవైపు నుంచి,అతనిపై దాడి చేయగా, తల భాగాన గాయాలయ్యాయి.వెంటనే అక్కడే విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అర్షద్, తోటి అటవీ సిబ్బంది, అక్కడి స్థానికుల సాయంతో ఆటోలో గాజులపల్లె గ్రామ సమీపంలోని ప్రైవేట్ వైద్యశాల తరలించి, చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న చలమ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య ఆసుపత్రికి చేరుకొని, గాయపడిన దస్తగిరి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు.