Reporter -Silver Rajesh Medak.
ఏప్రిల్ 4, 2024.
పోలింగ్ కేంద్రంలో ఓటరు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకునేట్లు చూడాల్సిన బాధ్యత ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు.
గురువారం నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పార్లమెంటు ఎన్నికలు నిర్వహణలో పిఓ, ఎపిఓ విధులు నిర్వహించు సిబ్బందికి నిర్వహిస్తున్న . శిక్షణ తరగతులను
జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై పిఓ, ఏపీవోలు పూర్తిస్థాయిలో అవగాహన కలగి ఉండాలని అన్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో భారత ఎన్నికల సంగ నిబంధనలు ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు లేకుండా ఖచ్చితంగా మార్గదర్శకాలను పాటించాలన్నారు. పోలింగ్ ప్రక్రియలో ఈవిఎం, వివిపాట్ వినియోగం, సీల్ వేయటం, ప్రత్యేక ట్యాగ్, పోలింగ్ కేంద్రంలో ఉపయోగించే అన్ని రకాల స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫారాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ ప్రారంభానికి ముందు ఏజెంట్లకు పోలింగ్ నియమాలపై వివరించాలని, పోలింగ్ ప్రారంభించడానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహించు విధానంపై వివరించాలన్నారు. మాక్ పోలింగ్ లో 50 కి తక్కువ కాకుండా ఓట్లు వేయాలని, వేసిన ఓట్లు వివిపాట్ లోని స్లిప్పులతో సరిచూసిన తదుపరి ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేసి అనంతరం నిర్దేశిత సమయంలోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వి.వి.ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడంపై అవగాహన ఉండాలన్నారు. పోలింగ్ ప్రక్రియ నిర్వహణపై పిఓలు, ఎపిఓలు అవగాహన కొరకు హ్యాండ్ బుక్ (కరదీపిక) అందచేస్తున్నామని క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని చదవాలని పేర్కొన్నారు. బ్యాలెట్ గోప్యతను కాపాడే విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ ప్రాంతం, ఓటర్ల వివరాలు తెలిపే నోటీసు బోర్డులు, ఫారం -7 లో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాని పోలింగ్ స్టేషన్ బయట ఏర్పాటు చేయాలన్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ హ్యాండ్ బుక్ లోని సూచనల ప్రకారం అన్ని పత్రాలను సీల్ చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి, తాసిల్దార్లు నర్సాపూర్ కమలాద్రి, శివంపేట తాసిల్దార్ శ్రీనివాస్ కౌడిపల్లి ఆంజనేయులు కొల్చారం గఫర్, మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు