Reporter -Silver Rajesh Medak. తేదీ 2-4-2024.
ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలి పి.ఎ.సి.ఎస్ సీఈవో ల శిక్షణ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) వెంకటేశ్వర్లు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో లోని సమావేశ మందిరంలో మంగళవారం పి.ఎ.సి.ఎస్ సొసైటీ సీఈఓ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రికార్డులు రిజిస్టర్లు సరైన క్రమంలో నమోదు చేయాలని, ట్యాగ్ చేసిన మిల్లుకే ధాన్యం వెళ్లేలా చూడాలని, రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద సరైన వసతులు ఏర్పాటు చేయాలని, సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు బ్రహ్మ రావు, హరికృష్ణ, కరుణ తదితరులు పాల్గొన్నారు.