Reporter -Silver Rajesh Medak.
తేదీ 2-4-2024 , మెదక్
జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలో 96 వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు.
రబీ 2023 2024 సంవత్సరానికి సంబంధించి ఐకెపి వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 96 ఏర్పాటు చేస్తున్నమని వాటిని వెంటనే ప్రారంభించాలని అధికారులు ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏపీఎంలు, సీసీలు, టాబ్ ఆపరేటర్లు, బుక్ కిపర్లకు సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ వేసవికాలం ఎండ ఎక్కువగా ఉన్నందున రైతులకు నీడ నీరు ఏర్పాటు చేయాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలు పాటించాలని ట్యాగ్ చేసిన మిల్లులకు మాత్రమే ధాన్యం పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు బ్రహ్మ రావు, హరికృష్ణ ,అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి డిపిఎంలు, మోహన్ ,ప్రకాష్ ,వెంకటేశ్వర్లు ఏ పి ఎం లు,సీసీలు, వివోఏలు, టాబ్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.