-ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, ఎండుతున్న పంటలకు 25వేల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెదక్ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం. పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
పార్టీ అధ్యక్షలు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పీలుపు మేరకు బోనస్ విషయం లో జిల్లా కేంద్రం మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఇది కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్ ధాన్యంపై 500 బోనస్ ఇస్తే రైతులకు కొంత ఊరట లభిస్తుందని అన్నారు.కానీ ప్రభుత్వం యొక్క పనితీరు చూస్తుంటే ఈ సీజన్లో బోనస్ అమలు కష్టమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను వంద రోజులు నెరవేరుస్తామని చెప్పి నాలుగు నేలలు కావస్తున్న వారిచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు అన్నారు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి వారికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వారికి పెద్ద పిట వేశారు అన్నారు.
రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని నాణ్యమైన కరెంటు సాగునీరు అందించాలని పండించిన పంటకు బోనస్ ఇస్తూ గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ధాన్యాన్ని కొనడం కోసం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు చేసిన ధాన్యానికి వారం రోజుల్లోనే వారికి ఖాతాలో డబ్బులు జామ చేశాం అన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు దుర్బర పరిస్థితిలో ఉన్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. మాజీముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట సమావేశంలో రైతుల గురించి ఆవేదన చెందారు అన్నారు.కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవగాహన రాహిత్యం వలన రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సాగునీటి కోసం కాలేశ్వరం తో పాటు చిన్న చిన్న ప్రాజెక్టు కట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంచడం జరిగింది అన్నారు.
420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీ లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు..కెసిఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నాఅన్నారు. రైతులకు బి అర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ యం.లావణ్య రెడ్డి, ఎంపీపీ ఫోరం అధ్యక్షులు హరికృష్ణ, మెదక్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఎం గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ, గ్రంధాలయ చైర్మన్ లు బట్టి జగపతి,చంద్ర గౌడ్ మాజీ రైతుబంధు అధ్యక్షులు సోములు, పాపన్నపేట,శంకరంపేట ఆర్ మండల పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, పట్లూరి రాజు, కొల్చారం, చిలిపిచెడు ఎంపీపీలు మంజుల కాశీనాథ్ వినోద దుర్గా రెడ్డి మరియు నాయకులు అశోక్, లింగ రెడ్డి, బాగారెడ్డి,అంకం. చంద్రకళ రవి, ప్రతాప్ రెడ్డి,లక్ష్మణ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.