Reporter -Silver Rajesh Medak.
తేదీ 2-4-2024
మెదక్
వేసవిలో గ్రామాల్లో త్రాగు నీటి సమస్యలు తలెత్తొద్దు.
అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు త్రాగునీరు అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో యంత్రాంగం సిద్ధంగా ఉండాలి.
రెండు రోజుల్లో గ్రామాల్లో త్రాగునీటిపై యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి
గ్రామాల్లోని తాగునీటి సరఫరా పై ప్రతిరోజు రిపోర్టు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలి. జిల్లాలో త్రాగునీటి సరఫరాలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు మిషన్ భగీరథ నీరు ప్రతి గ్రామంలో గడపగడపకు అందాలి. గ్రామాల్లో నర్సరీల రక్షణ బాధ్యత గ్రామ కార్యదర్శిలదే గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలు ఉదయం 6 నుంచి 11 లోపే పని చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . గ్రామాలలో మంచినీటి సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే అందుకు ప్రత్యామ్నాయ త్రాగునీరు అందించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ , ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో మంగళవారం వేసవిలో త్రాగు నీటి ఎద్దడి నివారణకు చేపట్టే చర్యల పై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామ పంచాయితీ లలో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టలని అధికారులను ఆదేశించారు . గ్రామాలలో మరమ్మత్తులలో ఉన్న బోర్లు, చేతి పంపులు, మంచినీటి పైపులైన్లు లీకేజి మరమ్మత్తులు, నూతన పైపు లైన్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేసి గ్రామాలలో ప్రజలకు త్రాగునీరు అందించాలన్నారు.ఎక్కడైనా మంచినీటి సరఫరాలో ఇబ్బంది వస్తే తక్షణమే తన దృష్టికి తేవాలని తెలిపారు. వేసవిలో నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుతో నీటి సరఫరాకు సిద్దంగా ఉండాలని తెలిపారు.
మంచినీటి వనరులు మాత్రమే కాకుండా ప్రైవేటు బోర్లు, బావుల ద్వారా గ్రామాలలో నీటిని అందించడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామాలలో ప్రైవేటు బోర్లు, బావులు ఇతర నీటి వనరుల వివరాలు సేకరించి నివేదికలు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర పరిస్థితులలో వాటి ద్వారా గప్రజలకు నీటిని సరఫరా చేయాలని అన్నారు. గ్రామాలలో ప్రజల అవసరాలకు ఎన్ని లీటర్ల నీరు అవసరం, గ్రామంలో ఉన్న ఓహెచ్‌ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల సామర్థ్యం ఎంత, ఎన్ని గంటలు బోర్లు నుండి ట్యాంకులు నింపవచ్చు, అనే అంశాలపై ప్రతి గ్రామ పంచాయితీ కార్యదర్శికి సమగ్రమైన అవగాహన ఉండాలని తెలిపారు.
వేసవి కాలం ముగిసేంత వరకు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది రావొద్దని ఆయన పేర్కొన్నారు.పురోగతిలో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని, మరమ్మత్తులకు వినియోగించే సామగ్రి నాణ్యత ఉండాలని తెలిపారు.వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నందున, తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎండల్లో బయట తిరగకుండా జాగ్రత్త వహించాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని, మద్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల మద్యలో ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు తెలిపారు. ఎండాకాలంలో నిలిపి ఉన్న వాహనాలలో పిల్లలు పెంపుడు జంతువులను వదల వద్దని, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వంట నివారించాలని, ఎండలలో పనిచేయవద్దని ఆల్కహాల్ ,టీ, కాఫీ, స్వీట్స్ చల్లని డ్రింక్స్ తీసుకోవద్దని , చెప్పులు లేకుండా బయట నడవవద్దని అన్నారు.
అలాగే చిన్నారులు, వయోవృద్దులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతి రోజు సరిపడ నీరు తీసుకోవాలని, వదులుగా ఉన్న దుస్తువులను ధరించాలని, బయటికి వెళ్ళేటప్పడు గొడుగు లేదా టోపిని దరించాలని, ద్వి చక్రవాహానాల పై సుదూర ప్రయాణాలు చేయకూడదని సూర్యుని కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటీతో పాటు ఓ.ఆర్.ఎస్. ద్రావణాన్ని తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడు కోవచ్చన్నారు.
చర్మం పై ఎర్రటి దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటివి చర్మం పై వస్తున్న మార్పులను గమనించాలని, అధిక శరీర ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో సంప్రదించి లేదా 108 కు ఫోన్ చేసి చికిత్స, అవసరమైన మందులు పొందాలని, అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు.ఉపాధి హామీ కూలీలు ఉదయం 6 నుంచి 11 వరకు పని చేయాలన్నారు. ఉపాధి హామీ పని జరిగే ప్రదేశాల్లో త్రాగునీరు, టెంట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కచ్చితంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ జెడ్పి సీఈఓ ఎల్లయ్య ,జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి శ్రీరామ్ , DRDA శ్రీనివాస్ రావు, DPO యాదయ్య, ఈ ఈ మిషన్ భగీరథ కమలాకర్ సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.